07-08-2024 08:27:35 PM
కూసుమంచి : ఖమ్మంలోని కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో బుధవారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పాలేరు రిజర్వాయర్ నుండి జోన్ 2 ఎడమ ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.