20 July, 2026 | 9:54 PM

మహంకాళి సన్నిధిలోమంత్రి పొన్నం

20-07-2026 02:25 AM

సికింద్రాబాద్, జూలై 19 (విజయక్రాంతి) : ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మ హంకాళి అమ్మవారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భం గా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షా లు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కు టుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యా లు వెల్లివిరియాలని కోరుకున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఆషాఢ మాసంలో జరిగే బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్న మంత్రి, ఉత్సవాలు జరుగుతున్న రాష్ట్రంలోని అన్ని దేవాలయా ల్లో మంచి వర్షాలు కురిసి ప్రజలంద రూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆలయ పూజారులకు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. మంచివర్షాలు కురిసిన పుడే రైతాంగమే కాకుండా సబ్బండవర్గాలు సంతోషంగా ఉంటాయని ఆకాంక్షించారు.