భద్రాచలం పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి
- నాణ్యతకు ప్రాధాన్యతనీయాలి
- పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలి
- ప్రాచీన వైభవానికి భంగం వాటిల్లవద్దు
- అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
భద్రాచలం, జూలై 19, (విజయక్రాంతి): గోదావరి పుష్కరాల సమయాన్ని కంటే ముందే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని, నిర్మాణాల పనులపై ప్రతి పది రోజులకు క్షేత్ర సమీక్షలు నిర్వహించాలని, పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం మంత్రి జిల్లా కలెక్ట ర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పా యం వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, భద్రాచలం గ్రామ సర్పంచ్ పూనెందొర, దేవస్థానం ఈవో దామోదర్ రావులతో కలిసి ఆలయంలో కొనసాగుతు న్న పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ పునరుద్ధరణ పను లు, పురోగతి, అభివృద్ధి కార్యక్రమాలపై మం త్రికి అధికారులు వివరించారు.
ప్రభుత్వం కేటాయించిన రూ. 351 కోట్లతో వందశాతం పనులు పూర్తి చేయాలని, అవసరమైన భూ సేకరణకు రూ. 75 కోట్లు వెచ్చించామన్నారు. గోపురాలు, పురాతన నిర్మాణాలను పరిశీలించి ప్రాచీన వైభవానికి ఎలాంటి భం గం వాటిల్లకుండా పనులు చేపట్టాలన్నారు. ప్రత్యేక అధికారిని నియమించాలని దేవాదాయ కమీషనర్ హనుమంతరావును ఆదే శించారు. బాధ్యత కలిగిన అధికారులను మాత్రమే పనుల పర్యవేక్షణకు నియమించి వారు క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండేలా ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న కార్మికుల కంటే అవసరమైన చోట 25 శాతం అదనంగా నియమించాలన్నారు.






