24-06-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూన్ 23 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని మానేరు డ్యాం సమీపంలో ఉన్న శాతవాహన ఫార్మసీ కళాశాలలో అకాడమిక్ బ్లాక్, ప్రహరీ గోడ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జి ల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మం త్ర తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉ న్నదని, విద్య కోసం అవసరమయ్యే నిధులు సమకూరుస్తామని, విశ్వవిద్యాలయాలలో నాణ్యత ప్రమాణాలు కూడా పెంచుతామని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయ అభి వృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ పిఎం ఉష నిధుల కింద విడుదలయ్యే నిధులను ఈ అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి కేటాయించామని, ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వము, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వము నిధులు మంజూరు చేస్తారన్నారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచా ర్య యు ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాయాల కో సం తరగతి గదుల కోసం అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తున్నామని, రాష్ట్ర, కేం ద్ర ప్రభుత్వ సమన్వయంతో ముందుకు సా గుతున్నామన్నారు.
ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగాలను కూడా నింపేందుకు ప్రయ త్నం చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుండి కొన్ని కొత్త కోర్సులు తీసుకొచ్చి శాతవాహన విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో మొదటి స్థానంలో నిలపడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొం డూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ మున్సిపల్ కమిషన ర్ ప్రఫుల్ దేశాయి, జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖేడే, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆ చార్య జాస్తి రవికుమార్, ఓ ఎస్ డి డాక్టర్ హరికాంత్, విద్యార్థులుపాల్గొన్నారు.