సీఎం మేడారం పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
11-08-2026 12:00 AM
ములుగు, ఆగస్టు 10 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం మేడారంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా వనదేవతలను దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు.
సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావ్, డిపిఓ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.






