17 April, 2026 | 10:10 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రపంచంలో అంబేద్కర్ ఐకాన్ ఆఫ్ నాలెడ్జి: మంత్రి సీతక్క

12-05-2025 08:33 PM

ప్రపంచానికి చుక్కని అంబేద్కర్ ఆలోచన

ఓ చాయివాలా ప్రధాననవ్వడం అంబేద్కర్ పుణ్యమే

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి 

ప్రతి ఇంటిలో అంబేద్కర్ ఫోటో పెట్టుకోవాలి

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన అభినందనీయం

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): ప్రపంచానికి అంబేద్కర్ ఆలోచన విధానం చుక్కాని అని, అంబేద్కర్ ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కొనియాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామంలో సోమవారం రూ.17 కోట్లతో నిర్మించిన మండల రహదారులు, రూ.2.45 కోట్లతో బెల్లంపల్లి నుండి చాకపల్లి వరకు నిర్మించ తలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ చాకపల్లి గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండే విట్టల్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు.

అనంతరం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ సభలో పాల్గొని సీతక్క మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగ పీఠికతో అణగారిన బడుగు బలహీన దళిత వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారన్నారు. అంబేద్కర్ లేకపోతే దళిత గిరిజన ప్రజలకు బతుకు లేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యమే చాయివాలా మోడీ దేశానికి ప్రధాని అయ్యాడని పేర్కొన్నారు. గుజరాత్  మూడుసార్లు సీఎం అయ్యాడని గుర్తు చేశారు. అలాంటిది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం పార్లమెంటులో అంబేద్కర్ ను హేళన చేశాడని విమర్శించారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్నీ, తను రాసిన రాజ్యాంగాన్ని పాలకులు జీర్ణించుకోవడంలేదని అన్నారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మహనీయుల స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. ప్రతి ఇంటిలో అంబేద్కర్ ప్రతిభను ఏర్పాటు చేసుకొని గౌరవించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ చాకపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం అభినందనీయమ న్నారు. ఇంజనీర్ శంకర్ ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో వెళితే ప్రతి ఒక్కరరూ ఉన్నతమైన అభివృద్ధిని సాధిస్తారన్నారు. చదువుతోటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారని గుర్తు చేశారు. అంబేద్కర్ ను అంటరానిగా చూసినా ఆ సమాజంలో ఎంతో కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగాడన్నారు. అంతేకాదు ప్రపంచంలో గర్వించదగిన ప్రజాస్వామ్యానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించాడన్నారు. చదువు వల్లనే అంబేద్కర్ ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా నిలిచాడన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి అంబేద్కర్ విశేషంగా కృషి చేశాడన్నారు.

రాజ్యాంగం లేకముందు అనగారిన ప్రజలకు హక్కులు ఉండేవి కాదన్నారు. అంటరాని వారిగా అణచివేత గురయ్యారన్నారు. అణగారిన ప్రజలకు దళితులకు గిరిజనులకు ఆత్మగౌరవం అంబేద్కర్ రాజ్యాంగం తోటి అందించాడన్నారు. ప్రపంచంలో అంబేద్కర్ గొప్పదార్శ నీకుడని ప్రశంసించారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండే విటల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డిసిపి భాస్కర్, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్, టీసీసీపీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ నాతరి స్వామి, టీసీసీపీ సభ్యులు చిలుముల శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునీమంద రమేష్, మాజీ ఎమ్మెల్యే సక్కు, ఆసిఫాబాద్ డిసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోచలింగం, ఉపాధ్యాయురాలు, వ్యాఖ్యాత ఎర్ర సువర్ణ తదితరులు పాల్గొన్నారు.