12-05-2025 08:38:05 PM
కాటారం,(విజయక్రాంతి): కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని కాటారంకు చెందిన దాడిచెర్ల అశోక్ కు చెందిన ఎద్దు విద్యుత్ఘాతంతో మృతి చెందింది. రైతు అశోక్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో అతని ఎద్దు సోమవారం ఉదయం విద్యుత్ షాక్ తో మరణించింది. విషయం తెలుసుకొని విద్యుత్ శాఖ అధికారులు, వెటర్నరీ డాక్టర్ చనిపోయిన ఎద్దును పరిశీలించారు. చనిపోయిన ఎద్దు విలువ సుమారు రూ.45 వేలు ఉంటుందని యజమాని అశోక్ అన్నారు. తమకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు విన్నవించారు. రైతుకు ప్రభుత్వం పరంగా సహాయం అందేలాగా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.