calender_icon.png 6 December, 2024 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

22-07-2024 11:29:32 AM

జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం ములుగు, గోవిందరావు పెట, తాడ్వాయి, ఏటూరు నాగారం, వాజేడు మండల్లాలో  భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలు, వరద ముంపు గ్రామాలను సందర్శిస్తున్నారు. ములుగు మండలం బండారు పల్లిలోని రాళ్ళవాగు, మెడివాగులను,  గోవిందరావు పేట మండలంలోని దయ్యాల వాగు వరద ప్రవాహాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలసి పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, ఆర్ అండ్ బి డి.ఈ.రఘువీర్, తదితరులు ఉన్నారు.