9 July, 2026 | 2:35 AM

ఓడేడు బాధితురాలికి మంత్రి శ్రీధర్ బాబు భరోసా

09-07-2026 01:37 AM

రూ. 1.25 లక్షల ఎల్‌ఓసీ అందజేత

ముత్తారం, జూలై 8 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన రత్నం శైలజ (భర్త భరత్) అనే మహిళ ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సదరు కుటుంబ సభ్యులు తమకు వైద్య సహాయం అందించాలని మంత్రి శ్రీధర్ బాబును ఆశ్రయించారు.

బాధితురాలి పరిస్థితిపై వెంటనే స్పందించిన మంత్రి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 1,25,000 (లక్షా 25 వేల రూపాయల) వైద్య సహాయాన్ని ఎల్ ఓసి ని అత్యంత వేగంగా మంజూరు చేయించారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు ఈ ఎల్ ఓసి పత్రాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమకు అత్యవసర సమయంలో లక్షా 25 వేల రూపాయల ఎల్‌ఓసీ మంజూరు చేయించి కొండంత అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబుకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.