9 July, 2026 | 2:34 AM

10న మెగా జాబ్ మేళా

09-07-2026 01:38 AM

సిద్దిపేట కలెక్టరేట్, జూలై 8: మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక,పరిశ్రమల శాఖ మంత్రివర్యులు డా.వివేక్ వెంకటస్వామి  సంయుక్త ఆదేశాల మేరకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ నెల 10 న ఉదయం 11 గంటలకు హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్స్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్న ట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డా. ప్రియాంక తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్ ట్రైనర్, బైక్ రైడర్, నర్స్, టైలర్ తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సూచించారు.