calender_icon.png 14 November, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బ్యాంకు భవన నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ

07-11-2024 01:12:24 PM

మంథని (విజయక్రాంతి): మంథని సత్య సాయినగర్ లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మంథని బ్రాంచ్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. రూ.35 లక్షలతో నిర్మించనున్న నూతన భవనం త్వరితగతిన పూర్తి కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొండూరి రవీందర్ రావు, ఛైర్మన్ కెడిసిసి బ్యాంక్ కరీంనగర్, సత్యనారాయణ రావు, ముఖ్య కార్య నిర్వహణాధికారి, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్, మంథని బ్రాంచ్ మేనేజర్ ఉదయశ్రీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.