calender_icon.png 6 December, 2024 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్వానంగా బోరు.. పట్టించుకోని అధికారులు

07-11-2024 01:25:05 PM

అనంతగిరి (విజయక్రాంతి): అనంతగిరి మండలం పాలవరం గ్రామంలో అయ్యగారు ఇంటి ఎదురుగా హ్యాండ్ బోరు కింది భాగంలో పగిలిపోయి బోరు నుండి బయటికి వచ్చిన మురికి నీరు వర్షపు నీరు బోరులోకి చేరి త్రాగునీరు కలుషితమై ప్రజలకు రకరకాల వ్యాధులు సంభవించే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కలుషితమైన త్రాగునీరు తాగాలంటే నరకయాతన అనుభవిస్తున్నారని అధ్వానంగా ఉన్న హ్యాండ్ బోరు నెలల తరబడి మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా అధికారులు స్పందించి హ్యాండ్ బోరు రిపేర్ చేసి ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరుతున్నారు.