15 April, 2026 | 11:31 AM

1 నుంచి నుమాయిష్

29-12-2025 02:42 AM

ఫిబ్రవరి 15 వరకు నిర్వహణ

ప్రదర్శన పర్యవేక్షణకు 

34 ఉప-కమిటీలు, 

320 మంది వలంటీర్లు 

వివరాలు వెల్లడించిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిష న్ జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వర కు జరుగుతుందని, దీనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. చారిత్రాత్మక ‘నుమాయిష్’ హైదరాబాద్ కల్చర్‌లో ఒక ప్రత్యేకతని, ప్రజలందరూ సురక్షితంగా ప్రదర్శనను సంద ర్శించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వ హించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.

ప్రతిరోజూ సా యంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు, శని, ఆదివారాలు, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. ప్రవేశ రుసుంగా ఒక్కరికి రూ.50 కాగా, 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితమని స్పష్టం చేశారు. ప్రదర్శన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి 34 ఉప-కమిటీలు ఏర్పాటు చేశామని, మొత్తం 320 మంది వలంటీర్లు విధుల్లో ఉంటారని వివరించారు.

ఈ ఏడాది స్టాళ్లకు విపరీతమైన డిమాండ్ ఉందని, దేశవ్యాప్తం గా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1,050 మంది తయారీదారులు, కళాకారు లు పాల్గొంటున్నారని తెలిపారు. వీటితో పాటు 20 ఫుడ్ కోర్టులు, రిజర్వ్ బ్యాంక్, అటవీ శాఖ, జైళ్ల శాఖ, పోలీస్, పర్యాటక శాఖ వంటి పలు ప్రభుత్వ విభాగాల స్టాళ్లు కూడా ఉంటాయని వెల్లడించారు. గాంధీ భవన్, నాంపల్లి మెట్రో స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు ఎగ్జిబిషన్ వేళలకు అనుగుణంగా అదనపు ట్రిప్పులతో అందుబాటులో ఉంటాయ ని, టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కు స్టాళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చామని, మహిళా సంక్షేమం పట్ల ఎగ్జిబిషన్ సొసైటీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.