13-01-2026 12:04:29 PM
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో(Khammam district) మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని(Manchukonda Lift Irrigation Project) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వి. వెంకటాయపాలెం వద్ద మంత్రి తుమ్మల మోటర్ స్విచ్ ఆన్ చేశారు. మంచుకొండ ఎత్తిపోతలను జాతికి అంకితం చేశారు. మంచుకొండ పథకంతో రఘునాథపాలెం, ఖమ్మం అర్భన్ మండలాలకుసాగునీరు లభిస్తుంది. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ తో 35 చెరువులు నింపేలా ఏర్పాటు చేశారు. సాగర్ జాలాలను మళ్లించి 2 పంటలకు సాగునీరందించేలా ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. మంచుకొండ లిఫ్ట్ తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని మంత్రి తుమ్మల వెల్లడించారు.