calender_icon.png 13 January, 2026 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రాండెడ్ పేర్లతో నకిలీ మందుల దందా

13-01-2026 12:21:05 PM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్లో(Quthbullapur) డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పలు ఔషధ దుకాణాల్లో డీసీఏ అధికారులు దాడులు(Drug Control raids) నిర్వహించారు. దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ లేబుల్స్, స్టిక్కర్లు వేసి నకిలీ మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. మెడికల్ షాప్ యజమాని మల్లికార్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.