13-01-2026 01:00:00 PM
హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ(Hyderabad Vijayawada highway) రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ బోల్తా పడటంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. ఓఆర్ఆర్ నుంచి బాట సింగారం వరకు వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఓఆర్ఆర్ నునంచి ఇనామ్ గూడ వరకు సుమారు ఆరు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. వాహనదారుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు లారీని తొలగించారు. అటు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా, పెదకాపర్తి, చిట్యాల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది.