calender_icon.png 13 January, 2026 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టులో సునీత మరో పిటిషన్

13-01-2026 12:37:36 PM

న్యూఢిల్లీ: తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. పాక్షికంగానే అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడాన్ని సునీత సవాల్ చేశారు. సునీత అప్లికేషన్ పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రస్తుత అప్లికేషన్, పెండింగ్ పిటిషన్లపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. సీబీఐ విచారణ కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని గతంలో హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి ఆయన ఇంట్లో హత్యకు  గురైన విషయం తెలిసిందే.