calender_icon.png 13 January, 2026 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిగిలిపోయిన స్పౌజ్ బదిలీలు చేపట్టండి

13-01-2026 11:10:51 AM

ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి పి ఆర్ టి యు  విజ్ఞప్తి

ముకరంపురా,(విజయక్రాంతి): జీవో317 వల్ల భార్య ఒక్క జిల్లా , భర్త ఒక జిల్లాగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా 90% పూర్తి చేసిందని, మిగిలిపోయిన 10%  స్పౌజ్ బదిలీలు కూడా పూర్తిచేసి  స్పౌజ్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి  ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం.చెన్నయ్య  బృందం ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి  మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా మిగిలిపోయిన అన్ని స్పౌజ్ బదిలీలు పూర్తి చేస్తామని, స్పౌజు ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం .చంద్రశేఖర్ రావు ,  పి ఆర్ టి యు తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్ నాయకులు ఇప్పలపల్లి చక్రధర్, తోట వీరేందర్ ,గడమల్ల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.