30-07-2024 12:54:28 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రైతు పటల రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరుగుతుంది. రెండో విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం విడుదల చేయనున్నారు. రెండో విడతలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీకి 6.4 లక్షల మంది రైతులు ఉండగా.. వారి ఖతాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.6,190 కోట్లు జమా చేయనుంది. తొలివిడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేసింది.
రుణమాఫీ ద్వారా ఇప్పటివరకు 17.75 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు జమ కానున్నాయి. ఈ రోజు జరిగే రెండోదశ రుణమాఫీ పథకం ప్రారంభోత్సవ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో పరిశీలించారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ కోసం ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు రకాల ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పూలు, గడ్డి తదితర వస్తువులు అధికారులు పెట్టారు.