ట్రయల్ రన్ సక్సెస్.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల
27-06-2024 10:55 AM
అశ్వాపురం: ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్ మోటర్ల ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. పంప్ హౌస్ వద్ద గోదావరికి మంత్రి పూజలు చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో మంత్రి తుమ్మల పర్యటించారు. బి.జి. కొత్తూరు పంప్ హౌస్ ను పరిశీలించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. ఈ ఏడాది వైరా ప్రాజెక్టు వరకు నీళ్లు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. మంత్రి తుమ్మల ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే.






