calender_icon.png 5 December, 2024 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ పునర్జీవం ఎంతో అవసరం: మంత్రి ఉత్తమ్

08-11-2024 03:52:13 PM

హైదరాబాద్: మూసీ పునర్జీవం ఎంతో అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూసీ ఆయకట్టు మొత్తం పుజర్జీవం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి నల్లొండ జిల్లా పొడువునా మూసీ నది ప్రవహిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ పునరుజ్జీవనాన్ని స్వాగతీస్తున్నారని ఉత్తమ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవానికి కార్యాచరణ ప్రారంభించారు. నేడు సీఎం తో పాటు యాదాద్రిలో పర్యటిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాగా, సీఎం రేవంత్ వలిగొండ మండలం సంగెం నుంచి భీమలింగం వరకు మూసీ పునరుజ్జీవ పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో భారీగా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.