calender_icon.png 18 September, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసాపై కరీంనగర్‌లో మంత్రి వర్గ ఉపసంఘం పర్యటన

10-07-2024 06:58:50 PM

కరీంనగర్, (విజయ క్రాంతి): ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను చైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సభ్యులుగా కమిటీలో ఉన్నాారు. ఈ కమిటీ ఈనెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వరుసగా పర్యటించనున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ నెల 19న పర్యటిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందిని, ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను సమగ్ర నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేసిన తర్వాత రైతు భరోసా పథకం అమలు చేయబడిన ఉన్నట్లు సమాచారం.