22 July, 2026 | 2:02 AM

ఎమ్మెల్యే నాయినికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, పొన్నం

22-07-2026 12:17 AM

హనుమకొండ, జూలై 21(విజయ క్రాంతి):ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం నిమిత్తం హనుమకొండకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సమీక్షా సమావేశం అనంతరం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేక్ కట్ చేసి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, మురళి నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.