22 July, 2026 | 1:59 AM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

22-07-2026 12:16 AM
  1. సింగరేణి సంస్థ ప్రణాళిక, ప్రాజెక్టుల విభాగ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు,
  2. కేటీకే ఓసీ 3 ప్రాజెక్టులో ఘనంగా మొక్కల నాటే కార్యక్రమం

గణపురం, జులై 21 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని  సింగరేణి సంస్థ ప్రణాళిక, ప్రాజెక్టుల విభాగ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు అన్నారు. బొగ్గు నియంత్రణ సంస్థ, బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కేటీకే ఓసీ 3 ప్రాజెక్టు ఓపెన్కాస్ట్ విభాగంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి సంస్థ ప్రణాళిక, ప్రాజెక్టుల విభాగ డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు, భూపాలపల్లి సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, లు గని ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  మొక్కల పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పచ్చని వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

గనుల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు సింగరేణి సంస్థ నిరంతరం కృషి చేస్తోందని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి వృక్షాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  కేటీకే ఓసీ 3 ప్రాజెక్టు అధికారి  రామస్వామి, ప్రాజెక్టు మేనేజర్ డి. రాంబాబు, ఓసీ నిర్వహణాధికారి జి. సంపత్, యూజీ ప్రతినిధి సునీల్ కుమార్, ఏరియా విభాగాధిపతులు, అధికారులు కార్మిక సంఘాల నాయకులు  ఎం. రమేష్,బి. మధుకర్ రెడ్డి, ఓసీ పిట్ కార్యదర్శులు ఎస్. కృష్ణారెడ్డి, జి. హరికృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలను నాటారు.