28 August, 2026 | 3:21 PM

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రులు

28-08-2026 02:17 PM

వరంగల్ (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ శుక్రవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి నివాసంలో రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రి సురేఖ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి రాఖీ కట్టడం, అందులో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పాల్గొనడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.