30 August, 2026 | 11:23 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

హామీలు నెరవేర్చలేకనే మంత్రుల పర్యటన రద్దు

14-07-2026 01:37 AM

పినపాక, జూలై 13 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మరిచిపోయిందని, హామీలు నెరవేర్చలేకనే ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన రద్దు చేసుకున్నారని బి.ఆర్.యస్. పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి అన్నారు.

సోమవారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో బి.ఆర్. యస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారని, కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించిన ప్రాజెక్టును సందర్శించడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం 31 నెలలు గడిచినా కనీసం మట్టికూడా పోయాలేదని అన్నారు.

పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముందు సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు పిలుపునిచ్చారని, కాని పోలీసులు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్లు చేయడం పద్దతికాదన్నారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిలు హామీలు నెరవేర్చకుండా మాయమాటలు చెప్తూ సందర్శన కార్యక్రమం చేపట్టడం దారుణమన్నారు.  ఈ కార్యక్రమంలో పినపాక మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ,  ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు, పి.ఎ.సి. యస్. అధ్యక్షులు రవివర్మ, పోలిశెట్టి సత్తిబాబు, కొండేరురాము రాము, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, కాయం శేఖర్, రాయల బాబు  తదితరులు పాల్గొన్నారు.