30 August, 2026 | 10:10 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

14-07-2026 01:39 AM

అధికారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశం

టేకులపల్లి, జులై 13, (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పనులను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం టేకులపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల స్థితిగతులను ఎంపీడీఓ శ్రీదేవి, హౌసింగ్ ఏఈ గణేష్ను అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు మంజూరైన పరిపాలనా అనుమతులు, ప్రారంభమైన ఇళ్ల సంఖ్య, ఇంకా ప్రారంభం కాని ఇళ్లకు గల కారణాలు, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతిపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఇంకా ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణంలో ఉన్న ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం పేదల గృహ కలను నిజం చేసేందుకు కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.