11-08-2025 10:04:18 AM
న్యూఢిల్లీ: తిరువనంతపురం నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం(Air India plane) ఆదివారం సాయంత్రం సాంకేతిక సమస్య కారణంగా చెన్నైకి మళ్లించబడిందని ఎయిర్లైన్స్ తెలిపింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఎయిర్‌బస్ A320 విమానంతో నడుపబడే AI2455 విమానం రెండు గంటలకు పైగా గాల్లోనే ఎగిరింది. ఆగస్టు 10న తిరువనంతపురం నుండి ఢిల్లీకి నడుస్తున్న AI2455 విమానం ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యతో విమానం చెన్నై మళ్లించారు. విమానంలో సాంకేతిక సమస్యపై ఎయిరిండియా ప్రతినిధి వివరణ ఇచ్చారు. రాత్రి 7.15 గంటలకు బదులు 8.17 గంటలకు విమానం బయల్దేరిందని ఎయిరిండియా పేర్కొంది. ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్య తలెత్తిందని సూచించింది. విమానం చెన్నై లో సురక్షితంగా దిగిందని వెల్లడించింది. చెన్నైలో విమానానికి అమసరమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎయిరిండియా విమాన ప్రయాణికుల్లోనే కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్(Congress MP KC Venugopal) ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమాన ప్రయాణ అనుభవాన్ని ఎక్స్ వేదికగా పంపుచుకున్నారు. భయంకరమైన విషాదానికి దగ్గరగా వెళ్లినట్లు వేణుగోపాల్ పోస్ట్ చేశారు. పలువురు ఎంపీలు, వందలాది ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన జరిగిందన్నారు. ఆలస్యంగా బయల్దేరిన విమాన ప్రయాణం భయానకంగా మారిందని పేర్కొన్నారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అల్లకల్లోలానికి గురయ్యాం అన్నారు. విమానంలో సిగ్నల్ లోపం ఉందని కెప్టెన్ గంట తర్వాత ప్రకటించారని సూచించారు. ఎయిరిండియా విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారని ఆయన పేర్కొన్నారు. ల్యాండింగ్ అనుమతి కోసం 2 గంటల సమయం పట్టిందని స్పష్టం చేశారు.
ల్యాండింగ్ కోసం విమానాశ్రయం చుట్టూ తిరుగుతూ ఎదురుచూశామని కేసీ వేణుగోపాల్(KC Venugopal) పేర్కొన్నారు. ల్యాండింగ్ సమయంలో అదే రన్ వేపై మరో విమానం ఉందని చెప్పారు. ఆ సమయంలో కెప్టెన్ నిర్ణయం ప్రయాణికుల ప్రాణాలు కాపాడిందని తెలిపారు. రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందన్నారు. కెప్టెన్ నైపుణ్యం, అదృష్టంతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడి ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. విమాన ఘటనపై దర్యాప్తు చేయాలని డీజీసీఏ, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విమానయాన అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్ కోరారు. మరోసారి ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఇటీవలి వారాల్లో ఎయిర్ ఇండియా విమానాలలో కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయి.