calender_icon.png 11 August, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

11-08-2025 08:29:52 AM

కోనరావుపేట, (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కోనరావుపేట మండలంలోని(Konaraopet Mandal) సుద్దాల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దాల గ్రామానికి చెందిన కుంటెల్లి రామస్వామి(45) తండ్రి రాజమల్లయ్య. మృతుడికి భార్య కొమురవ్వ, కుమారుడు అరవింద్ ఉన్నారు. ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో మృతుడు తమ సొంత పొలానికి వెళ్లివస్తానని బయల్దేరి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా బావిలో పడి శవమై కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఏ ఎస్సై తిరుమల బాబు  పోలీస్ సిబ్బంది స్థానికులతో కలిసి మృతదేహాన్ని బావిలో నుండి తీసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.