15 April, 2026 | 1:48 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

శిశు గృహ పిల్లలకు సేవ చేయడం అభినందనీయం

07-02-2026 04:24 PM

కెనరా బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ కళ్యాణ్ ముఖర్జీ

హనుమకొండ,(విజయక్రాంతి): మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ శిశు గృహ  రక్షణ సంరక్షణలో ఉన్న పిల్లలకు సేవ చేయడం అభినందనీయమని కెనరా బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ కళ్యాణ్ ముఖర్జీ అన్నారు. శనివారం రోజున లష్కర్ బజార్ కంచరకుంట ప్రత్యేక దత్తత వనరుల కేంద్రం (శిశు గృహ) కు కెనరా బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కార్యక్రమాలలో భాగంగా యాభై వేలకు పైగా విలువైన  బీరువా, మూడు ఊయలలు, రెండు రూమ్ హీటర్లు, ఒకటి మెడికల్ చెకప్ టేబుల్, ఇరవై మెడిసిన్ స్టోరేజ్ బాక్సులు, రెండు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందచేసిన

అనంతరం మాట్లాడుతూ వదిలివేయబడిన పిల్లలు, ప్రభుత్వానికి అప్పగించబడిన పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సేవ చేయాలంటే హృదయంతో పని చేయాలని అలాంటి పిల్లలకు నిరంతరం సేవ చేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. కెనరా బ్యాంక్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాల ద్వార అవసరాలు తెలుసుకొని సహకారం అందిస్తామని అన్నారు.

బాలికా సాధికారతకు కెనరా బ్యాంకు విద్యా జ్యోతి యోజన పథకం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్ లో శిశు గృహకు  సీఎస్సార్ కార్యక్రమాల ద్వార అవసరాలను గుర్తించి సహకరిస్తామని అన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు మాట్లాడుతూ బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం  రక్షణ సంరక్షణ అవసరమున్న పిల్లలకు శిశు గృహలో  పునరావాసం కల్పించి చట్ట బద్ధమైన దత్తత ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర దత్తత వనరుల విభాగం నిబంధనల మేరకు చట్ట బద్ధమైన దత్తతపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా శిశు గృహ పిల్లలకు పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ రాకేష్ రోషన్ వర్మ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు నక్క శాంతి కుమార్, ఉష, మేనేజర్ బండి శివ కుమార్, అసిస్టెంట్ మేనేజర్లు వి శ్రీనివాస్, గణేష్, శిశు గృహ ఇంచార్జి మేనేజర్ అనుముల మాధవి, సోషల్ వర్కర్ సంగి చైతన్య, ఓఆర్డబ్ల్యూ పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.