calender_icon.png 4 December, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పై దాడి

04-12-2025 12:42:19 AM

అయిజ, డిసెంబర్ 3: గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్,కండక్టర్ పై దాడి జరిగింది.బస్సు కండక్టర్ అనిత తెలిపిన వివరాల ప్రకారం ... ఆర్టీసీ బస్సు కర్నూల్ నుంచి ఐజకు బయలుదేరిన క్రమంలో వెంకటాపురం స్టేజి చేరుకోగానే అక్కడే రోడ్డుపై ఉన్న ఆటోకి బస్సు తగిలిందని ఆ క్రమంలో ఆటో డ్రైవర్ పరమేష్ ,బస్సు డ్రైవర్ కి స్వల్ప మాట మాట పెరిగి గొడవకు దారితీసింది.

అయితే ఆర్టీసీ డ్రైవర్ లోకన్నను ఆటో డ్రైవర్ బస్సు డోర్ ఓపెన్ చేసి కిందికి లాగినట్లు తెలిపింది.కండక్టర్ కలుగజేసుకుని డ్రైవర్ పై చేయి చేసుకోవడం సమంజసం కాదని  చెప్పినా వినకుండా మహిళా కండక్టర్ ని చూడకుండా దుర్భాషలాడుతూ...ఆమెపై కూడా చెయ్యి చేసుకున్నట్లు తెలిపింది. బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్ పరమేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కండక్టర్ తెలిపారు.