పిల్లలతో పాటు మహిళ అదృశ్యం
27-05-2024 12:56 AM
ఎల్బీనగర్, మే 26 : ఇద్దరు కుమారులతో పాటు తల్లి అదృశ్యమైన ఘటన ఆదివారం సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకున్న ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న కామ సరిత (43) తన ఇద్దరు కుమారులు మృదుల్(12), తరుణ్(9)లతో కలిసి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త శ్రీకాంత్ పలుచోట్ల వెతికాడు. ఫలితం లేకపోవడం తో ఆదివారం సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసిన వారు 8712662341, 8712662355 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సరూర్‌నగర్ పోలీసులు కోరారు.






