5 August, 2026 | 7:44 AM

హోటళ్లు, లాడ్జిల్లో పోలీసుల సోదాలు

27-05-2024 12:56 AM

రాజన్న సిరిసిల్ల, మే 26 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేము లవాడలోని పలు లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో బస చేస్తున్న వారి వివరాల నమో దు, సీసీ కెమెరాలు, హోటల్ గదులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా లాడ్జీలు, హోటళ్లు నిరహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాడ్జీలలో బసకోసం వచ్చే వారి ఆధార్ కార్డులు, ఇతర ఐడెంటిటీ కార్డులు తప్పకుండా తీసుకోవా లని, ఎవరైనా కొత్తవారు, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమా చారం ఇవాలని సూచించారు. 

లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా.. 

 నిజామాబాద్, మే 26 (విజయక్రాంతి): నిజామాబాద్‌లోని నవ దుర్గా లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఆదివారం దాడులు నిర్వ హించి నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయిబాబు తెలిపారు. లాడ్జి మేనేజర్ సతీశ్‌తో పాటు ముగ్గురు విటులు చెన్న గంగాదాసు అలియాస్ రాము, చెన్న దీక్షిత్, గుండేటి భోజన్నలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.