రెండో రోజూ బంక్‌లు బంద్.. ప్రజల పరేషాన్
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయిల్ కొరత
- చేతులేత్తిసిన పెట్రోల్ బంక్ యజమాన్యం
- పట్టించుకోని ప్రభుత్వాలు.. అధికారులు
- బ్లాక్‌లో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్
- ఆయిల్ లేక నిలిచిపోయిన వాహనాలు
- ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు,
- పెట్రోల్ కోసం గంటలకొద్ది క్యూలో లైన్‌లో పడిగాపులు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఏ పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్, డీజిల్ లేదు. అన్ని పెట్రోల్ బంక్ ల్లో నో స్టాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. మొదటి రోజు పెట్రోల్ లేదనే సమాచారంతో ప్రజలు, వాహదారులు బంక్ ల వద్దకు పరుగులు తీశారు.. వాహనాలతో, వాటర్ బాటళ్లు, క్యాన్లను తీసుకుని బంక్ ల వద్దకు పరుగులు తీశారు.
గంటల కొద్ది క్యూలైన్ లో నిలబడి పెట్రోల్, డీజిల్ తీసుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం, సత్తుపల్లి, వైరా, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, మధిర లాంటి మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఆయిల్ కొరత ఏర్పడింది.
ఉదయం సమయానికే అన్ని బంకుల్లో ఆయిల్ అయిపోవడంతో పల్లెటూర్లకు పరుగులు తీశారు. అక్కడ కూడా మధ్యాహ్నం సమయానికి నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా పెట్రోల్, డీజిల్ కోసం గాలించారు. గంటల తరబడి క్యూలైన్ లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ అందుబాటులో ఉన్న బంక్ ల వద్ద ప్రజలు గొడవ పడ్డారు. నేనంటే నేనే ముందు అంటూ వాగ్వాదం పడ్డారు. చివరి పోలీసులు రంగప్రవేశంతో సమస్య కొలిక్కి వచ్చింది.
రెండవ రోజు నో స్టాక్ బోర్డులు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు పెట్రోల్ బంక్ లలో ఆయిల్ లేదు. అన్ని బంక్ లలో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. పెట్రోల్ బంక్ ల ఎదుట తాడ్లు కట్టి మూసివేశారు.
అధికధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న వ్యాపారులు
బంక్ ల్లో పెట్రోల్, డీజిల్ అయిపోయిందనే సమాచారంతో కొందరు వ్యాపారులు అడ్డగోలుగా దొచుకున్నారు. లీటర్ పెట్రోల్ కు రూ. 300నుంచి రూ.400 వరకు అధనంగా వసూల్ చేసి విక్రయించారు. అధిక ధర ఉన్నప్పటికి చేసిది లేక వాహనదారులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీంతో ఒక్క రోజే భారీగా దండుకున్నారు.
ఆయిల్ కొరతపై మండిపడుతున్న జనం..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయిల్ కొత్త ఏర్పాటుతో ప్రజలు ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ముందుచూపు లేకపోవడమే కారణం అని ఆరోపించారు. తక్షణమే అన్ని కేంద్రాలకు పెట్రోల్ , డీజిల్ ట్యాంకర్లను పంపించాలని, ఆయిల్ కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మండిపడుతున్నారు.
ఉద్యోగులు, చిరు వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెట్రోలు డీజిల్ కొడతా తీవ్రమైన పరిస్థితులలో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, చిరు వ్యాపారులు పెట్రోల్, డీజిల్ లేక ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు డీజిల్ లేక నడిపే పరిస్థితి లేకుండా పోయింది.
పట్టించుకొని ప్రభుత్వం, అధికారులు
పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న తరుణంలో ప్రజా అవసరాలకు నిమిత్తం స్పందించాల్సిన ప్రభుత్వం అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కనీసం పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు, గొడవలు జరుగుతుండగా పోలీసులు అధికారులు అటువైపు తిరిగి చూసే పరిస్థితి లేదు.






