30 August, 2026 | 8:59 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

మిషన్ భగీరథ పనులు వేగవంతంగా చేయాలి

25-04-2025 11:24 PM

కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అర్గుల్ (నిజామాబాద్ జిల్లా) నుండి కామారెడ్డికి సరఫరా చేసే మిషన్ భగీరథ 14 కిలోమీటర్ల  పైప్ లైన్ పనులు వేగంగా పూర్తిచేయాలని అన్నారు.

కామారెడ్డి మున్సిపల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నీటి సరఫరా చేస్తున్న వివరాలు ఎరోజుకు ఆరోజు సమర్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోజువారీ కామారెడ్డి కి వస్తున్న నీరు వార్డుల వారీగా సరఫరా చేస్తున్న వివరాలు ప్రతీరోజు సమర్పించాలని అన్నారు. పట్టణ ప్రాంతంలో రీచార్జ్ స్ట్రక్చర్స్ నిర్మాణాలు చేపట్టాలని, ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వచ్చే వర్షాకాలం నాటికి రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, ఈఈ నరేష్, మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈఈ శంకర్, తదితరులు పాల్గొన్నారు.