10-12-2025 12:52:38 AM
జడ్చర్ల, డిసెంబర్ 9: ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల ఎమ్మెల్యే తీరు చర్చనీయాం శంగా ఉంటుంది. ఆ ఎమ్మెల్యే మాట్లాడిన ఏ పనులకు శ్రీకారం చుట్టిన తనదైన ముద్రవేసి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే జడ్చర్ల ఎమ్మెల్యే జనానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండరు అనే నినాదానికి ముగింపు పలుకుతూ తెల్లారి జామున 5 గంటలకే జడ్చర్ల లోని పారిశుద్ధ్య పనులు చేపట్టిన సిబ్బందికి తెల్లవారుజామున ఒంటరిగా దర్శనమిచ్చారు.
ఒక్కసారి ఎమ్మెల్యే రోడ్డుపై కనిపించడంతో మున్సిపల్ సిబ్బంది అప్పటికప్పుడు సన్నదమయ్యారు. పలువురు సిబ్బంది ఎమ్మెల్యే దృష్టి దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే చెప్పిన పలు అంశాలను తీసుకున్నారు. కాసేపు చీపురు తో రోడ్డును శుభ్రం చేశారు. ఖాళీ స్థలాలుగా ఏర్పరచుకొని చెత్తాచెదారం ఉండదు కారణమైన కాలీఫ్లవర్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
క్యాంపు కార్యాలయంలో వారంలో ఒక్కసారైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు జనానికి అందుబాటులో ఉంటే వారి సమస్యలు చెప్పుకునేందుకు బాగుంటుందని జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు చెబుతున్న మాట. వారి మాటకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సమయం ఇస్తారా? ఇవ్వరా? వేచి చూడాలి