calender_icon.png 11 December, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియాలో పండ్లు పంపిణీ

10-12-2025 12:50:51 AM

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): డిసెంబర్ 9న విజయ్ దివస్‌గా పేర్కొంటూ ఉస్మానియాలో పేద రోగులకు గడ్డం శ్రీనివాస్‌యాదవ్ పండ్లు  పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియలో చారిత్రాత్మకమైన డిసెంబర్ 9వ తేదీని పురస్కరించుకుని ‘విజయ్ దివస్’ వేడుకలను మంగళవారం గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లో ఘనంగా నిర్వహించారు.

ఉస్మానియా ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ర్ట నాయకులు గడ్డం జి శ్రీనివాస్ యాదవ్ రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గోషామహల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులను కలుపుకొని కార్యక్రమాలు విజయవంతం చేశామని తెలిపారు.

తెలంగాణ తల్లి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడంతో పాటు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రీనివాస్ యాదవ్, బద్రీనాథ్, కే కిషోర్, గణేష్, రమేష్ గౌడ్, నాగరాజు గుప్తా, జగదీష్ గుప్తా, సరస్వతి, స్వరూప, శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.