13 April, 2026 | 12:58 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

గడప గడప ప్రచారం చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

05-02-2026 03:33 PM

దేవరకొండ,విజయక్రాంతి: దేవరకొండ మున్సిపాలిటీ లోని మూడవ వార్డ్ ప్రచారంలో గడప గడప ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్ అనంతరం మాట్లాడుతూ... మూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంకూరి సుమలత రాజేష్  గెలుపు కోసం విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఎన్నికల నమూనా బ్యాలెట్ లో 02వ నెంబర్ పై మీ అమూల్యమైన ఓటు చేయి గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రతి ఇంటిని సందర్శించి స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, పట్టణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని వివరించి, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకూరి సుమలత రాజేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,పట్టణ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకురాలు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.