11 March, 2026 | 4:31 PM

Breaking News

వాడి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం   •   కుంభాభిషేకం – తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు   •   హేమలత చికిత్సకు సీఎం రిలీఫ్ ఫండ్: ఎమ్మెల్యే తలసాని   •   విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   సెన్సెక్స్ 1342 పాయింట్లు కుప్పకూలింది.. పెట్టుబడిదారులకు రూ.3 లక్షల కోట్ల షాక్ — కారణం ఇదే!   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •   పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి   •   గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •  

నూతన కేజీబీవీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్

18-06-2025 04:58 PM

దేవరకొండ: కొండమల్లేపల్లి మండలం కొలముంతల్ పహాడ్ రైతు వేదిక సమీపంలో నూతనంగా నిర్మించిన కేజీబీవి పాఠశాల(KGBV School) భవనాన్ని బుధవారం దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్(Devarakonda MLA Nenavath Balu Naik) ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాలలో సరైన వసతుల్లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అని అన్నారు.

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి అన్ని హంగులతో నూతన భవనాలను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. 40% డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జమున మాధవ రెడ్డి, డాక్టర్ వేణుధర్ రెడ్డి, దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, సిరాజ్ ఖాన్, ఆలంపల్లి నర్సింహా, ఊట్కూరి వేమన్ రెడ్డి, డిఈ శైలజ, ఏఈ లస్కర్, ప్రిన్సిపాల్ సరళ తదితరులు పాల్గొన్నారు.

==new code=== ==============