11 March, 2026 | 2:54 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి

18-06-2025 05:12 PM

మునగాల: హమాలీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు(CITU District President M Rambabu) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

బుధవారం మండల కేంద్రంలోని వివిధ రైస్ మిల్లులో పనిచేస్తున్న హామాలి కార్మికుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు పాల్గొన్న మాట్లాడుతూ... సంఘటిత అసంఘటిత రంగంలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి జూలై 29న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో 10 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు పాల్గొంటున్నాయని, ఈ సమ్మెలో హమాలీ కార్మికులు కూడా పాల్గొనాలని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్ లను తేవడం వలన కార్మిక హక్కులను హరించి వేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, హమాలి యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అనంత మైసయ్య గౌడ్, వేట అంజయ్య, జానయ్య, సాలయ్య, రాంబాబు, నాగయ్య, రవి, శ్రీను, సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.