calender_icon.png 13 January, 2026 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండారి

13-01-2026 02:29:34 AM

కుషాయిగూడ, జనవరి ౧౨ (విజయ క్రాంతి): కుషాయిగూడ డివిజన్ రెడ్డినగర్ కాలనీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఉప్పల్ ఎమ్మెల్యే బండార్ లక్ష్మారెడ్డి ఆవిష్కరిం చారు.కాలనీ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పి.ఎన్.రెడ్డి నగర్ కాలనీ అభివృద్ధికి తన వంతుగా అభివృద్ధి నిధులు కేటాయిస్తానని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాలనీలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే పరిష్కార మార్గానికి చొర చూపుతానని బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నేమూరి మహేష్ గౌడ్ కాలనీ అధ్యక్షుడు సిహెచ్ వెంకటరామిరెడ్డి గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కనకరాజుగౌడ్ ఉపాధ్యక్షుడు వాసుదేవరెడ్డి,  కాలనీవాసులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి

చర్లపల్లి డివిజన్లో సోనియా గాంధీ నగర్ కాలనీ ఫేస్ త్రీ లో సంక్రాంతి పండుగ సందర్భంగా విజేతలైన విజేతలకు బహుమతులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. సమాజంలో మగవారితో దీటుగా మహిళలు కూడా పోటీలు పడాలని బండారు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ చెర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు నేమూరి మహేష్ గౌడ్ సోనియా గాంధీ నగర్ గౌరవ అధ్యక్షులు కొండ సత్యనారాయణ ఎన్ పరశురాం రాజారత్నం అధ్యక్షులు నల్లోల కనకయ్య ప్రధాన కార్యదర్శి చందు చరక వెంకటేశు ఆకుల సంతోష్ లక్ష్మణ్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.