calender_icon.png 13 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలి

13-01-2026 02:28:13 AM

బోయిన్‌పల్లి వివేకానంద ఉచిత ట్యూషన్ సెంటర్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు 

సికింద్రాబాద్, జనవరి ౧౨ (విజయ క్రాంతి): వివేకానంద జయంతి రోజున నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బోయిన్‌పల్లి వివేకానంద ఉచిత ట్యూషన్ సెంటర్‌లో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలలో స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పగుచ్చా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రామిరెడ్డి, ప్రస న్న, మల్లేశం, శంకరాచార్య, పోలా బాబురావు, త్రికోణ కేశవరావు, పవన్, జోనా ఆ, నిర్మల సుధా, వజ్రంగ్ నాయుడు ముఖ్య అతిథులుగా  హాజరయ్యారు.

అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర గురించి తెలియజేస్తూ, స్వామి వివేకానంద ఆదర్శాలను అలవర్చుకుని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని పిలుపు నిచ్చారు. వివేకానంద ఉచిత ట్యూషన్ సెంటర్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ఉన్నత ఆలోచనలను కేవలం స్మరిం చడమే కాకుండా,వాటిని మన దైనందిన జీవితాల్లో ఆచరణలో పెట్టినప్పుడే వారికి మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని కే.కేశవరావు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానంద జయంతి సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు.