calender_icon.png 7 June, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగానికి ప్రతీక బక్రీద్ ....

07-06-2025 12:28:11 PM

ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే 

గద్వాల, (విజయక్రాంతి):  త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.   బక్రీద్ పండుగ సందర్బంగా  జిల్లా కేంద్రంలోని ఈద్గా, మండల పరిధి లోని గోనంపాడు గ్రామం లోని ఈద్గాల వద్ద వేరువేరుగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ... దైవాజ్ఞను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందన్నారు.  తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలన్నారు. అల్లా ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గం ప్రజలు, రైతులకు, సకాలంలో వర్షాలు కురిసే, సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా అల్లాను కోరుకోవడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..