19 August, 2026 | 2:32 AM

మల్లన్నసాగర్ నీటితో భువనగిరి, ఆలేరు ప్రజల దాహార్తి తీర్చుతాం

19-08-2026 12:28 AM

రూ.210 కోట్లతో తాగునీటి పైప్‌లైైన్ నిర్మాణం పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి

ఆలేరు, ఆగస్ట్ 18: మల్లన్న సాగర్ నీటితో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజల దాహార్తిని తీరుస్తారని ప్రభుత్వ విప్, ఆలే రు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య భువనగిరి ఎమ్మె ల్యే కుంభం అనిల్‌కుమారెడ్డిలు అన్నారు. రూ.210 కోట్ల వ్యయంతో మల్లన్నసాగర్ నుంచి భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగునీటిని తరలించే పైప్లైన్ నిర్మాణ ప నులను ఘనపూర్ గుట్ట వద్ద వారు పరిశీలించారు. తదుపరి అధికారులు, ప్రజా ప్రతిని ధులతో సమావేశం నిర్వహించి పైప్లైన్ నిర్మాణ పనుల పురోగతిని ఎమ్మెల్యేలు సమీక్షించారు.

ప్రాజెక్టుకు అవసరమైన 4.5 కిలో మీటర్ల అటవీ ప్రాంతానికి సంబంధించిన అ నుమతులను ప్రభుత్వం ఇప్పటికే పొందిందని తెలిపారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, ప్రజలకు వీలైనంత త్వరగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఎమ్మెల్యేలు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రూ. 210 కోట్లతో మల్లన్నసాగర్ నుంచి తా గునీటిని తరలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 

పైప్లైన్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవం తంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అలియాబాద్ ము న్సిపల్ చైర్పర్సన్ శిరీషాకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, మిషన్ భగీరథ సీఈ రాంచంద్రనాయక్, ఎస్‌ఈ వెంకట్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.