25 August, 2026 | 6:39 AM

అల్లాజీకి ఎమ్మెల్యే పరామర్శ

25-08-2026 12:00 AM

ఆమనగల్లు, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లికి చెందిన మాజీ వార్డు సభ్యుడు జంతుక అల్లాజి తల్లి మైసమ్మ ఈ నెల 23న గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకొని అల్లాజి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మైసమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన ఆయన, అల్లాజితో పాటు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దని, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.