calender_icon.png 20 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట తప్పని మడమ తిప్పని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

20-08-2025 01:31:45 AM

దేవాలయం నిర్మాణంకు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం

ఘట్ కేసర్, ఆగస్టు 19 : మాట తప్పని మడమ తిప్పని ప్రజా నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అని మాజీ ఎంపీపీ, బిఆర్‌ఎస్ పార్టీ ఘట్ కేసర్ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న మాల కులస్తుల పోచమ్మ దేవాలయo నిర్మాణం ప్రారంభంకు ముందుగా రూ. 7లక్షలు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆర్థిక సహాయం చేశారు.

మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు సమక్షంలో మాల పోచమ్మ కమిటీ సభ్యులైన పడగం ప్రవీణ్ కుమార్, ఎజ్జల రఘు, ఎజ్జల రాజేష్, గడ్డం శ్రీనివాస్, ఎజ్జల జగన్, మేకల సుధాకర్, ఎజ్జల శ్రీనివాస్, ఎజ్జల కృష్ణ, ఎజ్జల గణేష్ లకు రూ. 3 లక్షలు అందజేయడం జరిగింది. మొత్తం రూ.10 లక్షలు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డికి మాల పోచమ్మ దేవాలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు.