19 March, 2026 | 1:21 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

ప్రొటోకాల్‌పై స్పీకర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు

19-03-2026 12:57 AM

అలంపూర్ మార్చి 18: అలంపూర్ నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటిం చడం లేదని ఎమ్మెల్యే విజయుడు విన్నవించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి ప్రోటోకాల్ అంశంపై ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటివలే ప్రభుత్వం తరుపున నిర్వహి స్తున్న రంజాన్ తోఫా కార్యక్రమానికి కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విన్నవించారు. ఈ సందర్భంగా స్పీకర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు ఆయన తెలిపారు.

వంద పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలి 

  • అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్ మార్చి 18 అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే విజయుడు స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.

అదేవిధంగా ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఏపీ సరిహద్దు ప్రాంతం కావడంతో , ఉద్యోగస్తులకు ,విలేకరులకు , మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని సభాపతిని కోరారు. అంతేకాక ఐజా పట్టణంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఆవశ్యకత గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. సభాపతి ద్వారా ఎమ్మెల్యే ప్రస్తావించిన అంశాల పైన మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.