19 March, 2026 | 5:50 PM

కిట్స్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో నైపుణ్యాబివృద్ధిపై శిక్షణ

19-03-2026 12:58 AM

కోదాడ, మార్చి 18 : కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ఆధ్వర్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ , మూడవ సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు, టాస్క్ నిపుణులు  మార్క్ లౌయిస్ ఆధ్వర్యంలో బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ తరగతులలో  విద్యార్థి నులకు సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రాం మీద  విద్యార్థి నులకు అవగాహనా కల్పించారు.

ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను  పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విబాగాదిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.