17-06-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, జూన్ 16: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీహరి ముదిరాజ్ కు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ. క్రీడలు, యువజన సేవల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీహరి ముదిరాజ్ ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించాలనిఆకాంక్షించారు.