12 April, 2026 | 4:14 PM

స్కూల్​ విద్యార్థులకు వాటర్​ బాటిల్స్ ​పంపిణీ చేసిన బీజేపీ నేతలు

16-06-2025 11:42 PM

ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) సరూర్​నగర్ ​మండలం మనసురాబాద్ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బీజేపీ నాయకులు వాటర్ ​బాటిల్స్ ​పంపిణీ చేశారు. ముందుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం బీజేవైఎం నాయకుడు సోమనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్​ ప్రెసిడెంట్​ వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు బీజేపీ  పోరాటం చేస్తుందన్నారు.  ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని పార్టీ నాయకులకు సూచించారు.  ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి, బీజేపీ మన్సూరాబాద్​డివిజన్​ప్రెసిడెంట్​మునగాల హరీష్ రెడ్డి , బీజేవైఎం నాయకులు  అమరేష్  , సాయిరాం గౌడ్,  పారంద సాయి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.